Wednesday 12 July 2017

DESHA BAKTHI GEETALA, KAVITHALA RACHANA POTILU 2017


===================================================================
PATRIOTS WELFARE SOCIETY, MANCHERIAL
 Telangana State, INDIA ( Regd.no. 446/2014)
patriotswelfaresociety@gmail.com , Face book group – PATRIOTS WELFARE SOCIETY
====================================================

Date : 15-07-2017
దేశభక్తి గీతాల, కవితల రచన పోటీలు  2017
 మా సంఘం వారు  2015 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండదేశభక్తి గీతాల రచన పోటీలు నిర్వహిస్తున్నారు. 2015 లో నిర్వహించిన పోటిలకు 61 గీతాలు వచ్చాయి. 2016 లో నిర్వహించిన పోటిలకు 105 గీతాలు 125 కవితలు వచ్చినవి.

2015 లోని గీతాలను ఈ-పుస్తకం రూపంలో ముద్రించి మా వెబ్ సైట్ లో ఉంచాము. 2016
లోని ఎంపిక చేసిన గీతాలను పుస్తకం రూపంలో ముద్రిస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకాఎక్కువ గీతాలు, కవితలు వస్తాయని ఆశిస్తున్నాం. ఈ సంవత్సర  
అంశాలు :
అ)మత విద్వేషాలు లేని భారత దేశం
ఆ) భారత మాత
ఇ) అమ్మ, నాన్నలే ఆది దేవతలు
ఈ) భారత స్వాతంత్ర సముపార్జనలో మరియు అభివృద్ధిలో డా. బి.ఆర్. అంబేద్కర్ పాత్ర


బహుమతులు :
ప్రథమ బహుమతి :  రూపాయలు మూడు వేలు
ద్వితీయ బహుమతి : రూపాయలు రెండు వేలు
తృతీయ బహుమతి : రూపాయలు ఒక్క వెయ్యి
 ఎనిమిది  ప్రోత్సహాక బహుమతులు : ఒక్కక్కటి రూపాయలు ఐదు వందలు
తేదీలు :
ప్రారంభ తేది : జూలై 15,2017
ముగింపు తేది : ఆగష్టు15,2017
రచనలు పంపవలసిన చిరునామా :
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి,  ఇంటి. నెంబర్. 20-183/4 ,ఎడ్ల వాడ, కాలేజి రోడ్, మంచిర్యాల్ పిన్ : 504208  లేదా

షరతులు :
1)   గీతాలు, కవితలు అంశాలకు అనుగుణంగా ఉండాలి. ఒక అంశంనకు సంబంధించి మాత్రమే గీతాలు, కవితలు ఉండాలి
2)   ఈ సంవత్సరం నుంచి ప్రతి గీతానికి లేదా కవితకు ప్రవేశ రుసుము 100-00 పెడుతున్నాము. ప్రవేశ రుసుం లేని కవితలు లేదా గీతాలు తిరస్కరించబడతాయి
(సవరణ : ఒక కవికి రూపాయలు 100-00. ఒక కవికి ఒక బహుమతి మాత్రమే. ఒక కవి ఒకటి కంటే ఎక్కువ కవితలు, గీతాలు పంపవచ్చు. కానీ అత్యుత్తమైన ఒక కవిత లేదా గీతం మేము ఆశిస్తున్నాం.)
3)   ప్రవేశ రుసుమును క్రింది విదముగా చెల్లించాలి
అ ) Rs.100-00 చెక్కు “ PATRIOTS WELFARE SOCIETY ” అని రాసి కవితతో పంపాలి. చెక్కు వెనక మీ పేరు , సెల్ నెంబర్ రాయాలి లేదా
ఆ) Rs.100-00 D.D. ( Demand draft ) ను “ PATRIOTS WELFARE SOCIETY పేరుపై MANCHERIAL  లో చెల్లుబాటు ఆయె విదంగా తీయాలి  డీ.డీ.వెనక మీ పేరు , సెల్ నెంబర్ రాయాలి  లేదా
ఇ) Rs.100-00 Money order ద్వార ఈ క్రింది అడ్రస్ కు పంపాలి “ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి,  ఇంటి. నెంబర్. 20-183/4 ,ఎడ్ల వాడ, కాలేజి రోడ్, మంచిర్యాల్ పిన్ : 504208  ” లేదా
ఈ ) Rs.100-00 Indian Postal Order ( I.P.O ) ను S.NARENDAR REDDY పేరుపై MANCHERIAL లో చెల్లుబాటు ఆయె విదంగా  తీసి  మాకు పంపించాలి.
పోస్టల్ ఆర్డర్ వెనక మీ పేరు , సెల్ నెంబర్ రాయాలి
ఒ) రూపాయలు 100-00 ను ONLINE TRANSFER ద్వార చెల్లించవచ్చు.
ACCOUNT NAME : PATRIOTS WELFARE SOCIETY
Account Number : 6239 206 4465
BANK : STATE BANK OF INDIA, GARMILLA
BRANCH CODE : 20744
IFSC CODE: SBIN0020744
 (IFSC Code లో వున్నవి మూడు  ZEROs , O అనే లెటర్స్ కావు )- Online లో పంపిన తర్వాత రెఫెరెన్సు నెంబర్ ను  మాకు పంపండి 
Date : 07-08-2015 – సవరణ : వివిధ పత్రికలు ప్రవేశరుసుము గురించి ముద్రించనందు వల్ల . చాలా గీతాలు, కవితలు ప్రవేశ రుసుము లేకుండా వచ్చాయి. అందువల్ల ప్రవేశ రుసుమును తొలగిస్తున్నాము. ఇది వరకే వంద రూపాయలు కట్టిన వారికి అంత విలువ చేసే మా సంగం పుస్తకాలు పంపిస్తాము. )
4)   గీతాలు, కవితలు తెలుగు భాషలో ఉండాలి. సామాన్యులకు అర్ధమయ్యే భాషలోనే ఉండాలి.మీకు వీలయితే మీ కవితలు, గీతాలు ట్యూన్ చేసి మా మెయిల్ ఐ.డి. పంపండి. మా వెబ్ సైట్ లో ఉంచుతాము. ఆసక్తి వున్న వాళ్ళు వినవచ్చు. మీ గీతాలు ప్రజలలో దేశ భక్తిని పెంచడానికి తోడ్పడతాయి.
5)   ఇంతకు ముందు ఎన్నడు ముద్రితం కానీ, పుస్తక రూపంలో రాని రచనలను మాత్రమే పంపాలి
6)   మీ రచన క్రింద మీ పేరు, చిరునామా రాయాలి. రచనతో పాటు హామీపత్రం ఉండాలి.
7)   హామీ పత్రం లో రచయిత పేరు, చిరునామా, సెల్ నెంబర్, మెయిల్ ఐ.డి. రాయాలి.
ఈ గీతాల, కవితల హక్కులు మాకు ఇస్తున్నట్టు హామీ పత్రం రాయాలి.
8)  గీతాలు ఒక పల్లవి, నాలుగు చరణాలు ఉండాలి, మొత్తం ఇరవై లైన్లు ఉండాలి   
9) కవితలు నలబై లైన్లు ఉండాలి
10) గీతం, కవితలకు శిర్షిక ఉండాలి
11) చివరి తేదిని పొడగించే అవకాశం నిర్వాహకులకు గలదు
12)  బహుమతుల నిర్ణయంలో నిర్వాహకులదే తుది నిర్ణయం
13) బహుమతులు సంఘం ఎర్పాటు చేసే కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది
14) ఈ పోటిలకు పంపబడిన గీతాలు, కవితలు అవి బహుమతి పొందిన, పొందక పోయిన, సర్వహక్కులు మా సంఘం నకు చెందుతాయి. 
15) ఇతరులు రచించిన గీతాలు, కవితలు పంపరాదు, ఒకవేళ పంపితే ఆ రచయితలకు, మా సంఘంనకు మీరే బాద్యులు.
16) డిక్లరేషన్ లేదా హమిపత్రం క్రింద ఇవ్వబడినది
ప్రకటన జారి చేసిన వారు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షులు , దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
మరియు
అసిస్టెంట్ ప్రొఫెసర్, కామర్స్ విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల , మంచిర్యాల
వాట్స్ అప్ నెంబర్ 7386776361

డిక్లరేషన్ లేదా హమిపత్రం 2017
( Declaration for PATRIOTS WELFARE SOCIETY, MANCHERIAL, Reg.no.446/2014 , Telangana State,INDIA )



                ఫోటో
 


గీతం పేరు / కవిత పేరు :
రచయిత పేరు :
చిరునామా :
సెల్ నెంబర్ :
మెయిల్ ఐ.డి.
వయసు :
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారు నిర్వహిస్తున్న “  దేశభక్తి గీతాల, కవితల రచన పోటీలు 2017  ”  కు పంపిస్తున్న ఈ గీతం / కవిత నేను స్వయంగా రచించింది. ఏ మూలం నుంచి అనువదించింది కాదు. ఎవరి రచనలకు కాపీ కాదు. ఈ గీతం/ కవిత యొక్క సర్వహక్కులు “  దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల ” వారికి చెందుతాయి. చిరునామా పూర్తిగా వుంటే ఉత్తరాలు పంపడం వీలవుతుంది. ఫోటో పంపిస్తే పుస్తక ముద్రణలో వేస్తాం.


రచయిత సంతకం

తేది : __________
========================================================

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.